Thursday, 24 March 2016

నడిగర్‌ సంగమ్‌ స్టార్‌ క్రికెట్‌ మ్యాచ్‌కి బిగ్‌బీ, మెగాస్టార్‌



చెన్నై: ఏప్రిల్‌ 17 నుంచి ప్రారంభం కానున్న నడిగర్‌ సంగమ్‌ స్టార్‌ క్రికెట్‌ మ్యాచ్‌కు మెగాస్టార్‌ చిరంజీవి, బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ హాజరుకానున్నారు. దక్షిణ భారత ఫిల్మ్‌ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలను ఇప్పటికే వారికి పంపారు. మ్యాచ్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నటులిద్దరూ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. కార్యక్రమానికి తమిళ సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌, కమల్‌హాసన్‌ హాజరవనున్న విషయం తెలిసిందే.
ఈ టోర్నమెంట్‌లో భాగంగా జరిగే ఆరు మ్యాచ్‌లలో(ఎనిమిది జట్లు)48 మంది నటులు పాల్గొననున్నారు. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఏప్రిల్‌ 17న మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

No comments:

Post a Comment